Abn logo
Jan 26 2021 @ 22:46PM

‘తనిఖీ కేంద్రం 1995’ పోస్టర్‌ వదిలిన మారుతి

'దేవి' సినిమా ద్వారా బాలనటుడుగా అందరికి సుపరిచితమై, సంక్రాంతికి విడుదలైన విజయ్ 'మాస్టర్' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం "తనిఖీకేంద్రం 1995". తెలుగులో మొదటి క్రౌడ్ ఫండెడ్ మూవీ 'అంతర్వేదం' చిత్ర దర్శకుడు చందిన రవి కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హర్షిత ప్రొడక్షన్స్ మరియు ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్ర మొదటి పోస్టర్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్‌ విడుదల అనంతరం మారుతి మాట్లాడుతూ.. పోస్టర్ చాలా విభిన్నంగా ఉందని, ఇలాంటి సినిమాలు, ఇలాంటి యువ దర్శకులు పరిశ్రమకి చాలా అవసరమని అన్నారు. సినిమా సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరారు.


చిత్ర దర్శకుడు చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. 1995లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. సినిమా ఖచ్చితంగా ప్రజలని అలరిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో టీజర్ విడుదల చేసి.. అతిత్వరలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలుపగా.. 'మాస్టర్' చిత్రంలో విజయ్ సేతుపతి టీనేజ్ రోల్ ఎంత పేరు తెచ్చిందో.. ఈ చిత్రం దానికి పదింతలు గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది.. దర్శకుడు రవి కిషోర్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్లీ మళ్లీ.. రవి కిశోర్ చందినతో పని చేయాలని ఉంది.. అన్నారు హీరో మహేంద్రన్.

Advertisement
Advertisement
Advertisement