Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 01 Dec 2021 11:52:36 IST

సిరివెన్నెల మాటకి, పాటకి మరణం లేదు : కె.రాఘవేంద్రరావు

twitter-iconwatsapp-iconfb-icon
సిరివెన్నెల మాటకి, పాటకి మరణం లేదు : కె.రాఘవేంద్రరావు

దాదాపు 35 సంవత్సరాల పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని అద్భుతమైన గీతరచన తో ఊర్రూతలూపారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన మరణం నిజంగా తెలుగు సినీ సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆయనతో అనుబంధాన్ని పంచుకొన్న ఎందరో సినీ ప్రముఖులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చురుకైన మాటని, పదునైన పాటని మరిచిపోలేకపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు సిరివెన్నెల మృతి పట్ల తన సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. 


‘కాలం సిరివెన్నెల ని తీసుకెళ్లగలదు కానీ ఆయన కలం నుంచి వచ్చిన మాట కి, పాట కి మరణం ఎక్కడిది... తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల గారు పాటలతో నింపిన స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మదిలో కదులుతూనే ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’... అంటూ సిరివెన్నెలకి అక్షర నివాళులర్పించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement