Abn logo
Apr 3 2020 @ 08:40AM

మాన‌వ హ‌క్కుల సంఘాల‌ను ప్ర‌శ్నించిన హ‌రీశ్ శంక‌ర్‌

గాంధీ హాస్పిట‌ల్‌లో వైద్యులు, ఇత‌ర సిబ్బంది ప్రాణాల‌కు తెగించి క‌రోనా వైర‌స్ సోకిన పెషేంట్స్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఓ క‌రోనా పెషేంట్ బంధువులు డాక్ట‌ర్, అక్క‌డున్న సిబ్బందిపై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీరియ‌స్ అయ్యారు. ప‌లువురు డాక్ట‌ర్స్‌పై దాడి జ‌ర‌గ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. తాజాగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా డాక్టర్స్, సంబంధితన సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ.. సదరు విష‌యంపై స్పందించారు. ‘‘డాక్టర్లు, నర్సులు., పోలీస్‌లు పౌరులు, మానవులు కాదా..!!? నిన్న జరిగిన సంఘటనలపై  పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు...!! సజ్జనార్ సార్‌ను కడిగేయడానికి మాత్రం తోసుకుంటూ ముందుకొస్తారు’’ అంటూ తనదైన శైలిలో మానవ సంఘాలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు హరీశ్ శంకర్ .



Advertisement
Advertisement
Advertisement