గోపీచంద్ మ‌లినేని చేతుల మీదుగా ‘ఛ‌లో ప్రేమిద్దాం’ ఫ‌స్ట్ లుక్

హిమాల‌యా స్టూడియో మేన్షన్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శక‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్టర్ ఆవిష్కర‌ణ  ప్రసాద్ ల్యాబ్స్ లో డైరెక్టర్ గోపిచంద్ మ‌లినేని చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపిచంద్ మ‌లినేని మాట్లాడుతూ...``ఓ రోజు డైర‌క్ట‌ర్ సురేష్ వ‌చ్చి మోష‌న్ పోస్టర్ చూపించారు. మోష‌న్ పోస్టర్  న‌చ్చడంతో లాంచింగ్ కి వ‌చ్చాను. అంద‌రూ ప్రొడ్యూస‌ర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంక‌ట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఒక కొత్త డైర‌క్టర్ కి ఎంత స‌పోర్ట్ చేయాలో అంత స‌పోర్ట్ చేశారు. అలా ‘ఛ‌లో ప్రేమిద్దాం’ నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ గారు ఇచ్చిన మాట కోసం సురేష్‌కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఉద‌య్ కిర‌ణ్ గారు క‌చ్చితంగా గొప్ప నిర్మాత‌గా ఎదుగుతారు. ఇక ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్టర్ చూశాక విజువ‌ల్ ట్రీట్ లా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థమ‌వుతోంది. అంతా యంగ్ టీమ్ ప‌ని చేశారు.  భీమ్స్ ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా  మంచి పాట‌లు  ఇచ్చార‌నుకుంటున్నా.  యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్, చిత్ర నిర్మాత ఉద‌య్ కిర‌ణ్,  ద‌ర్శకుడు సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె,  డాన్స్ మాస్టర్ వెంక‌ట్  దీప్,  సంగీత ద‌ర్శకుడు భీమ్స్,  హీరో సాయి రోన‌క్,  న‌టుడు శ‌శాంక్,  పాట‌ల ర‌చ‌యిత సురేష్ గంగుల ఈ సినిమా విశేషాలు తెలుపుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.  శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్రభాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement