Jul 5 2021 @ 10:32AM

మలయాళ దర్శకుడు ఆంథోని కన్నుమూత

ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత ఆంథోని ఈస్ట్‌మన్‌(75) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో, ఆయన్ని త్రిస్పూర్‌లోని మెడికల్‌ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆంథోని మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేశాశారు. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆంథోని 'ఇనాయే తేడి' చిత్రంతో దర్శకుడిగా మారారు. తర్వాత వయల్‌, ఐస్‌క్రీమ్‌, అంబాడే న్జానే వంటి చిత్రాలను తెరకెక్కించారు. దివంగత నటి సిల్క్‌ స్మితను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈయనే.