ఆపద సమయంలో దిశ యాప్‌ రక్షణ కవచం

ABN , First Publish Date - 2021-08-04T05:10:23+05:30 IST

ఆపద సమయంలో దిశ యాప్‌ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆపద సమయంలో దిశ యాప్‌ రక్షణ కవచం
సమావేశంలో మాట్లాడుతున్న చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లె, ఆగస్టు3: ఆపద సమయంలో దిశ యాప్‌ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని    ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి  పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీ, మహిళ పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలదేనన్నారు. మండలంలోని స్థానిక సర్కిల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మహిళలకు భద్రత, దిశచట్టంపై అవగాహన కార్యక్రమానికి  ఎమ్మెల్సీ జకియాఖానం, డీఎస్పీ శ్రీధర్‌, మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ దిశయా్‌పపై మరో 20 మందికి తెలియజేసి దిశ చట్టాన్ని అమలు చేయాలన్నారు.  సీఐ యుగంధర్‌, ఎస్‌ఐలు వినోద్‌కుమార్‌, చిన్నపెద్దయ్య, తహసీల్దార్‌ తులశమ్మ, ఇన్‌చార్జి ఎంపీడీవో పట్నాయక్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నాగభూషణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రెడ్డెయ్య, జనార్దన్‌రెడ్డి, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ యర్రంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T05:10:23+05:30 IST