Abn logo
May 30 2020 @ 22:46PM

మరోసారి దర్శకత్వం

హాస్య సంభాషణలోనే కాదు వినోదభరిత చిత్రాలు తీయడంలో కూడా దర్శకుడు శివనాగేశ్వరరావుది ఓ ప్రత్యేక శైలి. ‘మనీ’, ‘వన్‌ బై టు’, ‘పట్టుకోండి చూద్దాం’, ‘సిసింద్రీ’ వంటి విభిన్న చిత్రాలు ఆయన రూపొందించారు. వెండితెరపైనే కాదు టీవీ తెరపై కూడా తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొంతకాలంగా ఆయన కథలు తయారు చేసే పనిలో ఉన్నారు. రెండు మూడు కథలు రెడీ చేశారు కూడా. ఇందులో ఓ కథను ఓ ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ కొన్నట్లు సమాచారం. ఆ కథతో రూపొందే చిత్రంలో ఓ అగ్రకథానాయకుడు నటిస్తారని వినికిడి. ఇక శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించే చిత్రం లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రారంభం కానుంది. 


Advertisement
Advertisement
Advertisement