కొఠియాల్లో ఒడిశా సిగ్నల్సే దిక్కు

ABN , First Publish Date - 2022-08-11T05:26:46+05:30 IST

సాలూరు మండలంలో వివాదాస్పద కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా సెల్‌టవర్‌ సిగ్నల్స్‌పై గిరిజనులు ఆధారపడాల్సి వస్తోంది.

కొఠియాల్లో ఒడిశా సిగ్నల్సే దిక్కు
కొఠియాలో ఒడిశా ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌

  ఏపీ సెల్‌ టవర్స్‌ నిల్‌

సాలూరు రూరల్‌, ఆగస్టు 10: సాలూరు మండలంలో వివాదాస్పద  కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా సెల్‌టవర్‌ సిగ్నల్స్‌పై గిరిజనులు ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడ ఏపీ నుంచి టవర్స్‌ లేకపోవడం విశేషం.  కొఠియాలో ఒడిశా బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ సిగ్నల్‌ టవర్‌ను ఏర్పాటు చేసింది. ఈ టవర్‌ నుంచి కొఠియా గ్రూప్‌లో చాలా ప్రాంతాలకు సిగ్నల్స్‌  వెళ్తున్నాయి. పట్టుచెన్నారు, పగులుచెన్నారు, ఎగువమెండంగి, కోనధార తదితర గ్రామాలకు కూడా ఒడిశా సిగ్నల్స్‌ వస్తున్నాయి. ఏపీ మైదాన ప్రాంతంలో ఉన్న నేరేళ్లవలస, దొరలతాడివలస, కుంబిమడ, మూలతాడివలస తదితర గ్రామాల గిరిజనులు సెల్‌ సిగ్నల్స్‌ కోసం సారిక సమీపంలో ఉన్న కొండపైకి చేరాల్సి వస్తోంది. ఇటీవల నేరేళ్లవలసలో పర్యటించినపార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌   నిశాంత్‌కుమార్‌కు ఆ ప్రాంతవాసులు ఈ సమస్యను తెలియజేశారు. ఇదిలా ఉండగా పట్టుచెన్నారు, పగులుచెన్నారు, డొలియాంబల్లో జియో టవర్స్‌ ఏర్పాటుకు ఏపీ అధికారులు పరిశీలించారు. వాటిని శరవేగంగా ఏర్పాటు చేస్తే ఒడిశా సిగ్నల్స్‌పై గిరిజనులు ఆధారపడే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 


Updated Date - 2022-08-11T05:26:46+05:30 IST