Abn logo
Apr 12 2021 @ 23:43PM

‘దిశ’ చట్టం.. మహిళలకు వరం

డీఎస్పీ వాసుదేవరావు

నౌపడ(సంతబొమ్మాళి), ఏప్రిల్‌ 12: సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వరంగా ‘దిశ’ చట్టం దోహదం చేస్తుందని ‘దిశ’ స్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు అన్నారు. సోమవారం నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో బాలికలకు దిశ చట్టంపై అవగాహన కలిగించారు.  దిశ చట్టం అమలుతో పాటు యాప్‌ అందుబాటులో ఉంద ని, ఆపదలో ఉన్న విద్యార్థినులు ఈ యాప్‌ద్వారా పోలీస్‌సాయం పొందవచ్చన్నారు. వీటిపై పూర్తి అవగాహన పొంది అత్యవసర సమయాల్లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌.ఐ ప్రభావతి, నౌపడ ఎస్‌ఐ మహ్మద్‌ యాసీన్‌, మాజీ సర్పంచ్‌ పిలక రవికుమార్‌ రెడ్డి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ అప్పలరాజు, హెచ్‌ఎం వైవీ వర్థిని పాల్గొన్నారు. 

 

 

Advertisement
Advertisement
Advertisement