Jul 26 2021 @ 03:58AM

యండమూరి దర్శకత్వంలో

సునీల్‌, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ కౌషల్‌, సీనియర్‌ నటుడు బెనర్జీ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి నిర్మాణంలో యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మహేశ్వరి వడ్డి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లు. శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘మొన్న ఛాటింగ్‌... నిన్న డేటింగ్‌... ఈరోజు మీటింగ్‌... రేపు’ అంటూ హీరోయున్‌ డైలాగ్‌ చెప్పే ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ‘మాతృదేవోభవ’ ఫేమ్‌ అజయ్‌కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘యండమూరి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ చేసిన వెంటనే మరో సినిమా ‘అతడు-ఆమె-ప్రియుడు’ నిర్మించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అని రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి చెప్పారు. ఈ చిత్రానికి కూనం కృష్ణకుమారి, కూనం ఝాన్సీ సహ నిర్మాతలు.