ఏకంగా 108 స్థానాలు జంప్‌

ABN , First Publish Date - 2022-06-23T08:54:41+05:30 IST

లేటు వయస్సులో అదరగొడుతున్న దినేశ్‌ కార్తీక్‌ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 108 స్థానాలు ఎగబాకాడు. తాజా జాబితాలో 37 ఏళ్ల ఈ వెటరన్‌ 87వ ర్యాంక్‌

ఏకంగా 108 స్థానాలు జంప్‌

దినేశ్‌ కార్తీక్‌కు 87వ ర్యాంక్‌

దుబాయ్‌ : లేటు వయస్సులో అదరగొడుతున్న దినేశ్‌ కార్తీక్‌ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 108 స్థానాలు ఎగబాకాడు. తాజా జాబితాలో 37 ఏళ్ల ఈ వెటరన్‌ 87వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ టాప్‌-10లోకి (6వ ర్యాంక్‌) దూసుకొచ్చాడు. స్పిన్నర్‌ చాహల్‌ బౌలర్లలో 23వ ర్యాంక్‌కు చేరాడు. ఇక టెస్ట్‌ ఆల్‌రౌండర్లలో  టాప్‌ను నిలబెట్టుకున్నాడు. టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీ పదో స్థానంలోనే కొనసాగుతుండగా..బౌలర్లలో అశ్విన్‌ రెండు, బుమ్రా మూడు ర్యాంకుల్లో నిలిచారు.

Updated Date - 2022-06-23T08:54:41+05:30 IST