సూపర్ హిట్టు పడుతుందా..?

డింపుల్ హయాతికి ఒక సూపర్ హిట్టు పడితే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారే అవకాశాలున్నాయంటున్నారు. కానీ లక్కే కలిసి రావడం లేదు. అందం, అభినయం ఉన్నా ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్టు కూడా దక్కలేదు. 2017లో 'గల్ఫ్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి.. తర్వాత 'యూరేకా' సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు డింపుల్ హయాతికి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో సూపర్ హిట్టు నీ హైటు సాంగ్ చేసింది. హాట్ హాట్ స్టెప్పులతో బాగానే అలరించింది. కాగా ఎట్టకేలకి డింపుల్ హయాతికి మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశం అందుకుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న 'ఖిలాడి' సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హోప్స్ అన్నీ రవితేజ 'ఖిలాడి' సినిమా మీదే పెట్టుకుంది. మరి సూపర్ హిట్టు అందుకొని టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారుతుందా లేదా చూడాలి. 

Advertisement
Advertisement