Abn logo
Dec 4 2020 @ 11:16AM

సినీ రంగంలోకి దిల్‌రాజు సతీమణి

డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన దిల్‌రాజు క్రమంగా అగ్ర నిర్మాత రేంజ్‌కు చేరుకున్నాడు. చిన్న సినిమాలనే కాదు.. స్టార్‌ హీరోలతో కూడా సినిమాలు చేసి సక్సెస్‌లు సాధించిన నిర్మాత దిల్‌రాజు. కథలను జడ్జ్‌ చేయడంలో దిల్‌రాజుకి మంచి గ్రిప్ ఉందని సినీ ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు. ఇప్పుడు ఆయన శ్రీమతి తేజస్విని కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారంటూ వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. తేజస్విని మైండ్‌లో రీసెంట్‌గా ఓ స్టోరి లైన్‌ మెదిలిందట. ఆ పాయింట్‌ విన్న దిల్‌రాజుకి కూడా నచ్చడంతో కొంత మంది రైటర్స్‌ను ఆ పాయింట్‌ మీద వర్క్‌ చేయమని సూచించడంతో పాటు ఆ కథను డెవలప్‌ చేసే బాధ్యతను కూడా తేజస్వినికే దిల్‌రాజు అప్పగించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే త్వరలోనే తేజస్విని పేరుని స్క్రీన్‌పై చూడొచ్చన్నమాట. 


Advertisement
Advertisement
Advertisement