రవిశాస్ర్తి పుస్తకావిష్కరణలో మనోళ్లెవరికీ మాస్కుల్లేవు!

ABN , First Publish Date - 2021-09-16T08:32:11+05:30 IST

టీమిండియా క్యాంప్‌లో కరోనా కేసులు బయటపడడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఆఖరి, ఐదో టెస్ట్‌ రద్దయిన సంగతి తెలిసిందే.

రవిశాస్ర్తి పుస్తకావిష్కరణలో మనోళ్లెవరికీ మాస్కుల్లేవు!

దిలీప్‌ దోషి

లండన్‌: టీమిండియా క్యాంప్‌లో కరోనా కేసులు బయటపడడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఆఖరి, ఐదో టెస్ట్‌ రద్దయిన సంగతి తెలిసిందే. ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ సందర్భంగా శాస్త్రితోపాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. శాస్త్రి పుస్తకావిష్కరణకు హాజరైన సందర్భంగా వీరందరికీ వైరస్‌ సోకింది. ఆ కార్యక్రమానికి హాజరైన టీమిండియా ఆటగాళ్లు కనీసం మాస్క్‌లు కూడా ధరించకపోవడంపై మాజీ క్రికెటర్‌ దిలీప్‌ దోషి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘తాజ్‌ గ్రూప్‌ ఆహ్వానం మేరకు నేను కూడా పుస్తకావిష్కరణకు వెళ్లా. అక్కడకు వచ్చిన భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా మాస్క్‌లు ధరించక పోవడాన్ని చూసి షాక్‌కు గురయ్యాన’ని దిలీప్‌ చెప్పాడు. వీళ్లంతా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదన్నాడు. కాగా ఐదో టెస్ట్‌ ఆడకపోవడానికి ఐపీఎల్‌ కూడా ఓ కారణం కావచ్చని దోషి అభిప్రాయపడ్డాడు. మెగా లీగ్‌ క్వారంటైన్‌ కోసం 15 రోజుల విరామం ఉండాలని భావించిన బీసీసీఐ.. నాలుగో టెస్ట్‌తోనే సిరీ్‌సను ముగించాలని ఇంగ్లండ్‌ బోర్డుకు ప్రతిపాదించించినట్టు తనకు తెలిసిందన్నాడు. 

Updated Date - 2021-09-16T08:32:11+05:30 IST