Abn logo
Oct 1 2020 @ 08:31AM

పింక్ దుస్తుల్లో దిగ్గజ సినీజంట.... ఫొటో వైరల్!

Kaakateeya

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ తన అద్బుత నటనతో నాటితరం ప్రేక్షకులను అమితంగా అలరించారు. నేటికీ దిలీప్ కుమార్ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రస్తుతం దిలీప్ కుమార్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ, అభిమానులను ఆనందింపజేస్తుంటారు. తాజాగా దిలీప్ కుమార్ ఒక ఫొటోను షేర్ చేశారు. 


ఈ ఫొటోలో ఆయన తనకు ఎంతో ఇష్టమైన పింక్ కలర్ షర్టు ధరించి కనిపిస్తున్నారు. ఈ ఫొటోలో దిలీప్ కుమార్ భార్య సైరా బానో కూడా కనిపిస్తున్నారు. ఆమె కూడా పింక్ కలర్ దుస్తులను ధరించడం గమనార్హం. ఈ ఫొటోను చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా దిలీప్ కుమార్ నటునిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా పలు చిత్రాలు నిర్మించారు. దిలీప్ కుమార్‌ను అభిమానులు ‘ట్రాజడీ కింగ్’ అని పిలుస్తుంటారు. 

Advertisement
Advertisement