Jul 7 2021 @ 09:54AM

నటుడు దిలీప్ కుమార్ మృతికి మోదీ, రాహుల్ సంతాపం

బాలీవుడ్‌కు చెందిన మహానటుడు దిలీప్ కుమార్(98) ఈరోజు ఉదయం కన్నుమూశారు. హిందీ సినీ జగత్తులో ట్రాజెడీ కింగ్‌గా పేరొందిన దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపారు.... దిలీప్ కుమార్ వెళ్లిపోవడం మన సాంస్కృతిక జగత్తుకు తీరని లోటు. అతని కుటుంబానికి  సానుభూతి తెలియజేస్తున్నాను. దిలీప్ కుమార్ సినిమా ప్రపంచంలో మహనీయునిగా ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భారత సినీ రంగానికి ఆయన చేసిన సేవలను ముందు తరాలు కూడా గుర్తుంచుకుంటాయన్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు నటుడు దిలీప్ కుమార్ మృతికి సంతాపం వెలిబుచ్చారు.