Jun 30 2021 @ 18:27PM

మరోసారి ఆస్పత్రికి...


ఇటవల కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఈ నెల రెండోవారంలో ఇంటికి చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దిలీప్‌కుమార్‌(98) మరోసారి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. Bollywoodమరిన్ని...