కుప్పకూలింది!

ABN , First Publish Date - 2022-08-13T05:53:55+05:30 IST

ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోణాం పంచాయతీ మెట్టవలసలో శుక్రవారం పాఠశాల భవనం శుక్రవారం కూలిపోయింది.

కుప్పకూలింది!
కూలిన పాఠశాల భవనం

  నేలమట్టమైన పాఠశాల భవనం 

  విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ముప్పు

సాలూరు రూరల్‌, ఆగస్టు 12:  ఇటీవల కురుస్తున్న వర్షాలకు  తోణాం పంచాయతీ మెట్టవలసలో శుక్రవారం పాఠశాల భవనం శుక్రవారం కూలిపోయింది. కొద్దిరోజులుగా ఖాళీగానే ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం పాఠశాల నిర్వహించకపోవడంతో విద్యార్థులకు పెను ముప్పు తప్పింది. ఈ గ్రామంలో 1 నుంచి 5 తరగతులతో ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల నడిచేది. ఇటీవల ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేశారు. అయితే తొలుత ఈ పాఠశాలను విలీనం చేయడానికి మేనేజ్మెంట్‌ అంగీకరించలేదు.  ఆ తర్వాత విలీనానికి ఒప్పుకున్నా.. భవనం అప్పగింతకు విముఖత చూపింది.  కాగా ఈ పాఠశాలలో  మొత్తంగా 45 మంది విద్యార్థులుండేవారు. పాఠశాల విలీనంతో అక్కడ విద్యార్థులు ఇతర పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ జీరో ఎన్‌ రోల్మెంట్‌ అని సాలూరు ఎంఈవో మల్లేశ్వరరావు చెప్పారు.  



Updated Date - 2022-08-13T05:53:55+05:30 IST