Sep 26 2021 @ 23:51PM

‘దిల్‌’ రాజు... వంశీ పైడిపల్లి... విజయ్‌66

తమిళ కథానాయకుడు విజయ్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్నారు. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘నా హోమ్‌ బ్యానర్‌లో ఈ సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. ‘‘విజయ్‌, వంశీ పైడిపల్లితో విజయ్‌66వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాం. మేం గర్వించే క్షణాలివి’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం తమిళంలో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ‘బీస్ట్‌’ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత విజయ్‌66 ప్రారంభం కానుంది. ఇందులో నటించబోయే తారలు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.