Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 16:39:52 IST

P.S.1: దిల్‌ రాజు చేతికి తమిళ క్రేజీ ప్రాజెక్ట్‌!

twitter-iconwatsapp-iconfb-icon

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తోందీ అంటే గత చిత్రాల ఫలితాలను పట్టించుకోకుండా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan 1)కోసం ఎంతో ఆతురతగా చూస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఇందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


అయితే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త హల్‌చల్‌ చేస్తోంది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ తెలుగు హక్కుల్ని శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్‌ అధినేత దిల్‌రాజు (Dil raju)సొంతం చేసుకున్నారని తెలిసింది. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌ రాజు తెలుగులో విడుదల చేయనున్నారట. విక్రమ్‌, కార్తీ, అర్జున్‌, జయం రవి, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, త్రిష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోహీరోయిన్ల లుక్స్‌, గ్లింప్స్‌ ఆకట్టుకున్నాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement