Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 09:42:06 IST

Dil Raju: అక్కినేని హీరోతో అలాంటి సినిమా ప్లాన్..?

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju).. అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ని చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తాజా సమాచారం. చైతూని టాలీవుడ్‌కి హీరోగా పరిచయం చేసింది దిల్ రాజు అనే సంగతి తెలిసిందే. సీనియర్ నటి రాధ కూతురు కార్తీక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న దిల్ రాజు, ఇటీవల మళ్ళీ చైతుతో థాంక్యూ సినిమాను నిర్మించారు.

విక్రమ్ కె కుమార్ దీనికి దర్శకుడు. అయితే.. లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో వచ్చి హిట్స్ అనుకున్న నాగ చైతన్య..దిల్ రాజు నిర్మించిన థాంక్యూ సినిమాతో మాత్రం ఫ్లాప్ చూశాడు. ఇలా ఆయన నిర్మాణంలో చైతూ నటించిన రెండూ ఫ్లాపవడంతో చాలా నిరాశ చెందినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో దిల్ రాజు అంటే ఏ హీరోకైనా హిట్ ఇస్తారనే చెప్పుకుంటారు. అలాంటిది చైతూకి మాత్రం ఫ్లాప్స్ ఇచ్చారు. అందుకే, ఇప్పుడు ఓ మాస్ మసాలా కథను చైతూ కోసం రెడీ చేయిస్తున్నారట.

ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట వినిపిస్తోంది. థాంక్యూ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే దిల్ రాజు..ఈసారి చైతూతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తానని చెప్పారు. ఇప్పుడిదే ప్రయత్నాలు మొదలైనట్టుగా సమాచారం. చూడాలి మరి దిల్ రాజు - చైతూ కాంబోలో వచ్చే మూడవ సినిమా అయినా హిట్ సాధిస్తుందా లేదా అనేది. కాగా, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయనున్న నాగ చైతన్య, త్వరలో దూత అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి విక్రమ్ కుమార్ దర్శకుడు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement