Abn logo
Aug 12 2020 @ 19:00PM

దిల్ రాజు కూడా ఆలోచనలో పడ్డారా?

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం `వి`. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా నిర్మాత మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు. 


`వి` సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే  థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ ఏడాది ఆ అవకాశం ఉండేలా కనబడడం లేదు. ఒకవేళ తెరిచినా ప్రేక్షకులు వస్తారా అనే విషయంలో గ్యారెంటీ లేదు. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మంచి ఆఫర్ వస్తే ఓటీటీలో విడుదల చేసెయ్యాలనుకుంటున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన `నిశ్శబ్దం` సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement