Abn logo
Apr 10 2020 @ 14:34PM

కేటీఆర్‌కు చెక్‌ను అందించిన దిల్‌రాజు

కోవిడ్ 19 మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నాయి. ఈ చ‌ర్య‌ల‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ వంతు మ‌ద్దతుని తెలియ‌జేస్తున్నారు. అంతే కాకుండా విరాళాల‌ను అందించారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ త‌ర‌పున దిల్‌రాజు, శిరీష్ తెలంగాణ‌కు రూ.10 ల‌క్ష‌లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళాన్ని అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన నిర్మాత‌ దిల్‌రాజు ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి ప్ర‌క‌టించిన‌ రూ.10 ల‌క్ష‌ల చెక్‌ను అందించారు. 

Advertisement
Advertisement
Advertisement