Abn logo
Mar 31 2020 @ 12:19PM

కరోనా ఎఫెక్ట్: దిల్ రాజుకు భారీ నష్టం?

కరోనా ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా సినీ రంగం భారీ నష్టాలను చవిచూస్తోంది. థియేటర్లు మూతబడడం, షూటింగ్‌లు ఆగిపోవడం వంటి కారణాల వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొంటోంది. టాలీవుడ్‌లో మిగిలిన వారితో పోల్చుకుంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎక్కువ నష్టపోయారట. 


ఉగాది సందర్భంగా ఈ నెల 25న విడుదల కావాల్సిన `వి` సినిమా వాయిదా పడింది. నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్‌క‌ృష్ణ రూపొందించిన ఈ చిత్రానికి దిల్ రాజు దాదాపు రూ.40 కోట్లు ఖర్చుపెట్టారట. ఇక, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా `వకీల్ సాబ్`ను ప్రారంభించారు. షూటింగ్ సగం పూర్తయింది. ఇప్పటికే ఆ సినిమా మీద రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. మళ్లీ సినిమా షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్ రాజు చేతిలో కొన్ని థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆదాయం లేకపోయినా సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద టాలీవుడ్‌లో ఇతర నిర్మాతలతో పోల్చుకుంటే దిల్ రాజు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం.  

Advertisement
Advertisement
Advertisement