చదువురాని బీజేపీ నాయకులకు ‘చేస్తాం’, ‘చూస్తాం’కు తేడా కూడా తెలియదు'

ABN , First Publish Date - 2021-06-13T01:55:43+05:30 IST

చదువు రానివాళ్లకి ‘కచ్చితంగా చేస్తాం(Shall)’, ‘పరిశీలనలోకి తీసుకుంటాం(Consider)..’ రెండు పదాలకు తేడా తెలియదని కాంగ్రెస్ సీనియర్..

చదువురాని బీజేపీ నాయకులకు ‘చేస్తాం’, ‘చూస్తాం’కు తేడా కూడా తెలియదు'

న్యూఢిల్లీ: చదువు రానివాళ్లకి ‘కచ్చితంగా చేస్తాం(Shall)’, ‘పరిశీలనలోకి తీసుకుంటాం(Consider)..’ రెండు పదాలకు తేడా తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై దిగ్విజయ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామని దిగ్విజయ్ అనడం మొత్తం కాంగ్రెస్ కుట్రేనని మండిపడింది. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా చేసిన ఈ వ్యాఖ్యలపై దిగ్విజయ్ తాజాగా స్పందించారు. ఓ మీడియా సమాశంలో మాట్లాడుతూ.. కొందరు చదువురాని మొద్దులకు చేస్తాం, చూస్తాం అనే పదాలకు కూడా తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.


కాగా.. అంతకుముందు పాకిస్తానీ జర్నలిస్ట్‌తో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా అప్లికేషన్ క్లబ్ హౌస్‌లో చేసిన ఆడియో చాట్ బయటకొచ్చింది. అందులో పాక్ రిపోర్టర్.. ‘ఒకవేళ రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారా..?’ అని ప్రశ్నించాడు. దీనికి దిగ్విజయ్ జవాబిస్తూ మొదట ఆ ప్రశ్న అడిగినందుకు సదరు జర్నలిస్ట్‌కు థాంక్స్ చెప్పారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 370పై కచ్చితంగా పరిశీలిస్తాం’ అని అన్నారు.



Updated Date - 2021-06-13T01:55:43+05:30 IST