దుష్యంత్ కూడా అకాలీదళ్ బాటలో నడవాలి... లేదంటే ... : దిగ్విజయ్ సింగ్

ABN , First Publish Date - 2020-09-18T21:16:09+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి వర్గం నుంచి అకాలీదళ్

దుష్యంత్ కూడా అకాలీదళ్ బాటలో నడవాలి... లేదంటే ... : దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి వర్గం నుంచి అకాలీదళ్ వైదొలగడాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్వాగతించారు. ఈ మేరకు హర్ ప్రీత్ సింగ్ బాదల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జన నాయక్ జనశక్తి పార్టీ అధినేత, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా అకాలీదళ్‌నే అనుసరించాలని ఆయన సూచించారు. లేదంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా తీవ్ర పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చట్టాన్ని తమ ప్రభుత్వం రూపొందించిందని, కానీ నేడు పెద్ద పెద్ద వ్యాపారులందరూ మండీల్లో వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించారని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సవరణ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు. పెద్ద వ్యాపారికి, రైతుకు మండీల వద్ద ఘర్షణ తలెత్తితే అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తుందని, కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లు రైతు వ్యతిరేక బిల్లులని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. 

Updated Date - 2020-09-18T21:16:09+05:30 IST