Aug 4 2021 @ 13:33PM

'వరుడు కావలెను': 'దిగు దిగు దిగు నాగ' సాంగ్ విడుదల

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న కొత్త చిత్రం 'వరుడు కావలెను'. తెలుగమ్మాయి రీతూ వర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మాంచి మాస్ బీట్‌తో సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. వరుస చిత్రాలతో నాగ శౌర్య చాలా బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి 'వరుడు కావలెను'. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా లేడీ డైరెక్టర్  లక్ష్మి సౌజన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై  సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టైటిల్‌తోనే ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన చిత బృందం 'దిగు దిగు దిగు నాగ' అంటూ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను తమన్ స్వరపరిచగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ పాడారు. మాస్ సాంగ్స్‌కి అదిరిపోయో డాన్స్ మూవ్‌మెంట్స్ కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం జానపద గీతాలకు ప్రేక్షకులనుంచి బాగా ఆదరణ లభిస్తోంది. అలా 'లవ్ స్టోరి' సినిమాలోని 'సారంగ దరియా' వచ్చి ట్రెండింగ్‌లో నిలిచింది. మరి 'వరుడు కావలెను'లోని.. 'దిగు దిగు దిగు నాగ' పాటకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.