Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీర్ణాశయం ఆరోగ్యానికి..!

ఆంధ్రజ్యోతి(14-04-2021)

ఒంట్లోని విషపదార్థాలను తొలగించడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకోసం పోపుల పెట్టెలో ఉండే జీలకర్ర, ధనియాలు, సోంపుతో తయారు చేసిన హెర్బల్‌ టీ తాగాలి. ఈ టీ తాగితే అజీర్తి, ఇతర సమస్యలు దరిచేరవు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు గీతా వర.


ఎలా తయారు చేయాలంటే

ఒక టీ స్పూన్‌ చొప్పున జీలకర్ర, ధనియాలు, సోంపు, ఒక లీటర్‌ నీళ్లు తీసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, సోంపును నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. ఈ హెర్బల్‌ టీని వడబోసుకొని వేడి వేడిగా తాగాలి. 


ఎలా పనిచేస్తుందంటే

జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

పోషకాలను వేగంగా గ్రహించేలా చేస్తుంది.

ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. 

వాపు, గ్యాస్‌, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్నిస్తుంది.

ఊపిరితిత్తులలో నీటిని తొలగిస్తుంది. నరాలకు సాంత్వన చేకూరుస్తుంది. 

కఫ, పిత్త, వాత దోషాలను ఒకే స్థాయిలో ఉంచుతుంది.

Advertisement
Advertisement