కోవిడ్‌‌పై శ్వేతపత్రానికి మాజీ సీఎం డిమాండ్

ABN , First Publish Date - 2020-06-03T21:02:35+05:30 IST

గోవాలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ బుధవారంనాడు..

కోవిడ్‌‌పై శ్వేతపత్రానికి మాజీ సీఎం డిమాండ్

పనజి: గోవాలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ బుధవారంనాడు డిమాండ్ చేశారు. మంగోర్ హిల్ ఏరియా నుంచి ఇటీవల 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆయన ఈ డిమాండ్ చేశారు.


'మంగోర్ హిల్‌లో కేసులు నమోదు కావడం ఆషామాషీగా తీసుకోరాదు. కరోనా టెస్టింగ్ ప్రోటోకాల్ విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తూ గోవా ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి. కమ్యూనిటీ పరీక్షలను త్వరితగతం చేసి, ఇమ్యునిటీపై సామాజిక చైతన్యం తెచ్చేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలి' అని కామత్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం, గోవాలా ఇంతవరూక 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 57 మందికి స్వస్థత చేకూరింది.

Updated Date - 2020-06-03T21:02:35+05:30 IST