Abn logo
Sep 27 2021 @ 23:19PM

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చండి : డీఐజీ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 27: ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతా లకు చేర్చాలని ఏలూరు రేండ్‌ డీఐజీ కేవీ.మోహనరావు పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. తుఫాను సహాయక చర్యలపై ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్సు ద్వారా ఏలూరు రేంజ్‌ పరిధిలోని నాలుగు జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం వివరాలను తెలుసుకున్నారు. భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. కల్వర్టులు, లోబ్రిడ్జి, ముంపునకు గురయ్యే రోడ్లు, పొంగిపొర్లే వాగుల వద్ద పోలీసు గస్తీ ఏర్పాటుచేసి రాకపోకలు నిలిపివేయాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షి త ప్రాంతాలకు తరలించేందుకు సంబంధించి అధికారులను సమన్వయం చేసుకుం టూ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై పడిపోయిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.