మాస్క్‌ లేకుండా బయటకు రావద్దు

ABN , First Publish Date - 2021-04-11T05:12:35+05:30 IST

తప్పనిసరైతేనే బయటకు రావాలని, బయటకు వస్తే మాత్రం తప్పక మాస్క్‌ ధరించాలని డీఐజీ త్రివిక్రమవర్మ సూచించారు.

మాస్క్‌ లేకుండా బయటకు రావద్దు
ద్విచక్ర వాహన చోదకులకు మాస్క్‌పై అవగాహన కల్పిస్తున్న డిఐజి త్రివిక్రమవర్మ, అర్భన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తదితరులు

డీఐజీ త్రివిక్రమవర్మ  

గుంటూరు, ఏప్రిల్‌ 10: తప్పనిసరైతేనే బయటకు రావాలని, బయటకు వస్తే మాత్రం తప్పక మాస్క్‌ ధరించాలని డీఐజీ త్రివిక్రమవర్మ సూచించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డితో కలసి హిందూ కళాశాల సమీపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీబస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ఆపి మాస్క్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా త్రివిక్రమవర్మ మాట్లాడుతూ ఇక నుంచి మాస్క్‌ ధరించకుండా ఎవరైనా కనిపిస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని, అప్పటికీ పద్ధతి మార్చుకోకుంటే వాహనాలు సీజ్‌ చేయటం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీఎస్పీ బీవీ రమణకుమార్‌, నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T05:12:35+05:30 IST