మహిళా పోలీసుల పనితీరు సమీక్షించిన డీఐజీ

ABN , First Publish Date - 2021-07-30T06:30:22+05:30 IST

సచివాలయాల మహిళా పోలీసుల పనితీరును రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ గురువారం సమీక్షించారు. అర్బన్‌ ఎస్పీ ఆఫ్‌హఫీజ్‌తో కలిసి కుందులరోడ్డులోని సచివాలయాన్ని సందర్శించారు.

మహిళా పోలీసుల పనితీరు సమీక్షించిన డీఐజీ
సచివాలయ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకుంటున్న డీఐజీ త్రివిక్రమవర్మ, అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌

గుంటూరు, జూలై 29: సచివాలయాల మహిళా పోలీసుల పనితీరును రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ గురువారం సమీక్షించారు. అర్బన్‌ ఎస్పీ ఆఫ్‌హఫీజ్‌తో కలిసి కుందులరోడ్డులోని సచివాలయాన్ని సందర్శించారు. మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బందితో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరించేలా వారికి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో వెస్ట్‌ డీఎస్పీ సుప్రజ, సీఐలు సుధాకర్‌, బాలసుబ్రహ్మణ్యం, రాజశేఖరరెడ్డి, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు. 

సచివాలయాల్లో అర్బన్‌ ఎస్పీ తనిఖీ

అర్బన్‌ పరిధిలోని ఓబుల్‌నాయుడపాలెం, వెంగళాయపాలెం, నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామ సచివాలయాల్లో, పట్టాభిపురంలోని వార్డు సచివాలయంలో అర్బన్‌ ఎస్పీ హఫీజ్‌ తనిఖీ నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సౌత్‌, వెస్ట్‌ డీఎస్పీలు  జెస్సీ  ప్రశాంతి, సుప్రజ,  సీఐలు బాలసుబ్రహ్మణ్యం, ప్రేమయ్య, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T06:30:22+05:30 IST