పుకార్లను ఎవరూ నమ్మవద్దు: డీఐజీ పాలరాజు

ABN , First Publish Date - 2022-05-25T02:09:03+05:30 IST

కోనసీమ జిల్లా కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగాయి. పోలీసులు అడ్డుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా....

పుకార్లను ఎవరూ నమ్మవద్దు: డీఐజీ పాలరాజు

అమలాపురం: కోనసీమ జిల్లా (Konaseema District)ను కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగాయి. కలెక్టరేట్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  మంత్రి విశ్వరూప్ (Minister Viswaroop), ఎమ్మెల్యే సతీశ్ (Satish) ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పరిస్థితిని డీఐజీ పాలరాజు (DIG Palaraju) సమీక్షించారు. ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారని ఆయన చెప్పారు. దాడులు చేసిన ఆందోళనకారులపై చర్యలు ఉంటాయన్నారు. సీసీఫుటేజ్‌ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని... అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని.. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  యువత హింసకు పాల్పడి భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని డీఐజీ పాలరాజు సూచించారు. 


Updated Date - 2022-05-25T02:09:03+05:30 IST