డీఐజీ కాంతిరాణా టాటా బదిలీ

ABN , First Publish Date - 2021-12-02T06:24:13+05:30 IST

అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా బదిలీ అయ్యారు. ఆయనను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

డీఐజీ కాంతిరాణా టాటా బదిలీ

అనంతపురం క్రైం, డిసెంబరు 1 : అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా బదిలీ అయ్యారు. ఆయనను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 2004 బ్యాచకు చెందిన కాంతిరాణా టాటా అనంతపురం జిల్లా రేంజ్‌లో డీఐజీగా నాలుగు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించారు. ఈయన హయాంలో పలు కీలక కేసులు ఛేదించడంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప లు అవార్డులను దక్కాయి. కాగా తక్షణమే విధుల్లో చే రాలంటూ సీఎస్‌ ఆదేశించారు. ఇదిలా ఉండగా అనంతపురం రేంజ్‌ డీఐజీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రమేష్‌ రెడ్డి రానున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-12-02T06:24:13+05:30 IST