Abn logo
Mar 4 2021 @ 00:50AM

ఒంగోలులో డీఐజీ పూజలు

ఒంగోలు(కల్చరల్‌), మార్చి 3: ఒంగోలు నగ రం సంతపేటలోని శ్రీషిరి డి సాయిబాబా మందిరం లో మహాశివరాత్రి యజ్ఞ మహోత్సవాల కార్యక్రమ ంలో భాగంగా బుధవా రం మహాధన్వంతరీ హో మం వైభవంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీఐజీ త్రివిక్రమవర్మ దంపతులు యజ్ఞకర్తలుగా వ్య వహరించారు. వేదపురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తిశాస్ర్తి హోమ క్ర తువును శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాయిబాబా మందిర ట్రస్ట్‌ ఛైర్మన్‌ అళహరి చెంచలరావు, క్రాశీవిశ్వేశ్వర దేవస్థాన ధర్మకర్త క వర్తపు శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement