Abn logo
Oct 28 2021 @ 00:47AM

ప్రభుత్వాల విధానాలతో కార్మికులకు కష్టాలు

సభలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు

 తాడిపత్రిటౌన, అక్టోబరు 27: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలతో కార్మికలోకం అ ష్టకష్టాలు పడుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణంలోని డైలీ కూరగాయల మార్కెట్‌ వద్ద బుధవారం సీపీఎం 13వ జిల్లా మహాసభలు బుధవారం నిర్వహించారు. మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు తీవ్ర కష్టాలపాలవుతున్నారన్నారు. కేంద్రం కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తోందన్నారు. డీజిల్‌, పెట్రోల్‌, వం టగ్యాస్‌ ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కరోనా కష్టకాలంలో రోజువారీ కూలీలు ప నులు లేక పూటగడవడం కష్టంగా ఉందన్నా రు. జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపా ల్‌ మాట్లాడుతూ వర్షాభావదంతో జిల్లాలో ల క్షల హెక్టార్లలో సాగుచేసిన పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి సాధ్యమన్న భ్రమలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, జిల్లా కార్యవర్గసభ్యులు నాగేంద్రకుమార్‌, అంగనవాడీ వర్కర్లు హెల్పర్ల సంఘం అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి జ్యోతిలత, పట్టణ అధ్యక్షురాలు గోవిందమ్మ, పట్టణ, మండల కార్యదర్శులు నరసింహారెడ్డి, జగనమోహనరెడ్డి, కార్యకర్తలు వివిధ కార్మిక సంఘాల అధ్యక్షకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ

సీపీఎం జిల్లా మహాసభలను పురస్కరించుకొని పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణం నుంచి సభాస్థలి వరకు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు సాగిన ర్యాలీలో వందల సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారు పార్టీ జెండా కలర్‌ అయిన ఎరుపు రంగుతో మహిళలు చీరలు ధరించారు.