జనన ధ్రువీకరణ పత్రాల కోసం తప్పని ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-07-25T06:17:30+05:30 IST

జనన ధ్రువీకరణ పత్రాల కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. మదన పల్లె జిల్లా వైద్యశాల ఏవో కార్యాలయంలో సర్వర్‌ మొరాయిస్తుండడంతో ఈ సమస్య తలెత్తుతోంది. దీంతో గంటల తరబడి కార్యాలయం వద్ద పడిగా పులు కాయాల్సి వస్తోంది.

జనన ధ్రువీకరణ పత్రాల కోసం తప్పని ఇబ్బందులు
కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న జనం

మొరాయిస్తున్న సర్వర్‌


జిల్లా ఆస్పత్రి ఏవో కార్యాలయం వద్ద పడిగాపులు 


ప్రజలను తిప్పుకుంటున్న సిబ్బంది!


మదనపల్లె క్రైం, జూలై 24: జనన ధ్రువీకరణ పత్రాల కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. మదన పల్లె జిల్లా వైద్యశాల ఏవో కార్యాలయంలో సర్వర్‌ మొరాయిస్తుండడంతో ఈ సమస్య తలెత్తుతోంది. దీంతో గంటల తరబడి కార్యాలయం వద్ద పడిగా పులు కాయాల్సి వస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో జన్మిం చిన చిన్నారులకు అక్కడే బర్త్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయాలన్నది ప్రభుత్వ నిబంధన. గతంలో మున్సి పల్‌ అధికారులు మంజూరు చేసేవారు. ఆ సర్టిఫి కెట్లు తప్పులతడకగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బందే మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వాస్పత్రుల్లో జనన ధ్రువీకరణ పత్రా లు జారీ చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఇచ్చే కాన్పు సర్టిఫికెట్‌, తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌, ఇంటి చిరునామా వివరాలను దరఖాస్తు ఫారంలో పొందుపరిచి ఆస్పత్రి అడ్మినిస్ర్టేషన్‌ కా ర్యాలయంలో అందిస్తే సంబంధిత సిబ్బంది పరిశీ లించి రెండుమూడు రోజుల్లో సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు. అది కూడా పుట్టిన చిన్నారికి నామకరణం చేసి ఉండాలి. దీంతోపాటు తల్లి ఆధార్‌కార్డులో భర్త చిరునామా తప్పక ఉండాలి. ఇవన్నీ అందుబాటులో ఉంటేనే సర్టిఫికెట్‌ చేతికి అందుతుంది.  అయితే సర్వర్‌ డౌన్‌ అని, దరఖాస్తు ఫారంలో తప్పులున్నా యంటూ, తల్లి ఆధార్‌కార్డులో తండ్రి చిరునామా లేదని, ఫోన్‌ నెంబర్‌ తప్పు రాశారంటూ...  సాకులుగా చూపుతూ ప్రజలను వారం రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిప్పు కుంటున్నట్టు విమర్శలున్నాయి. దరఖాస్తు ఫారం పూరించి అందజేసినప్పుడు... రే పొస్తే సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతున్న సిబ్బంది, తీరా అక్కడికెళ్లాక... తప్పులు చూ పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పు కుంటున్నట్టు తెలిసింది. అదేదో ఫారం అందజేసినప్పుడే పరిశీలించి తప్పులున్నా యని చెబితే అక్కడే దిద్ది ఇచ్చేవారమని పలువురు వాపోతున్నారు. దరఖాస్తు ఫారం సరిగ్గా ఉంటే సర్వర్‌ డౌన్‌ అని, సర్వర్‌ పని చేస్తే తప్పులు న్నాయంటూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆలస్యం గా వస్తే మరుసటి రోజు రమ్మంటున్నారు. ఇప్పటి కైనా ఉన్నతా ధికారులు స్పందించి సకాలంలో జనన ధ్రువీకరణపత్రాలు మంజూరు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. 


సర్వర్‌ డౌన్‌తో ఇబ్బందులు..


కొద్దిరోజులుగా సర్వర్‌ మొరాయిస్తుండడంతో అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. సర్వర్‌ డౌన్‌ కాకుంటే సకాలంలో సర్టిఫికెట్లు అందిస్తాం. ముఖ్యంగా జనన ధృవీకరణ పత్రాల్లో అక్షరదోషాలు లేకుండా చూడాలి. పత్రాల పరిశీలనకే సగం సమయం సరిపోతోంది. పూరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాకే సర్టిఫికెట్‌ తయారు చేయాలి. పొరపాటున అక్షరదోషాలు వస్తే మళ్లీ కరెక్షన్‌ చేసుకోవాల్సి ఉంది. అన్ని వివరాలు, ఆధారాల మేరకే పత్రాలను మంజూరు చేస్తున్నాం. కొంత ఆలస్యమైనా కరెక్టుగానే అందజేస్తున్నాం.

 - కె.ఆంజనేయులు, మెడికల్‌ సూపరింటెండెంట్‌


Updated Date - 2021-07-25T06:17:30+05:30 IST