విభిన్న ప్రతిభావంతులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’

ABN , First Publish Date - 2020-03-31T09:22:06+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న విభిన్న ప్రతిభావంతులు, సీనియర్‌ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్లకు లాక్‌డౌన్‌ కాలంలో అత్యవసర సేవలలో పని చేయకుండా మినహాయింపు ఇవ్వాలని దివ్యాంగుల

విభిన్న ప్రతిభావంతులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న విభిన్న ప్రతిభావంతులు, సీనియర్‌ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్లకు   లాక్‌డౌన్‌  కాలంలో అత్యవసర సేవలలో పని చేయకుండా మినహాయింపు ఇవ్వాలని దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. దీంతోపాటు ఆఫీసులకు రావాలన్న నిబంధనకూ మినహాయింపు ఇచ్చి, ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించేలా(వర్క్‌ ఫ్రమ్‌ హోం) చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తూ మెమో జారీ చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్‌రెడ్డికి,  ఈ ఉత్తర్వులు సాధించడంలో కృషి చేసిన ఏపీ జేఏసీ చైర్మన్‌  బొప్పరాజు వెంకటేశ్వర్లుకు ఏపీ విభిన్న ప్రతిభావంతుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - 2020-03-31T09:22:06+05:30 IST