UAEలోని వివిధ వీసా పథకాలు.. 18 ఏళ్ల నుంచి మొదలుకుని రిటైర్మెంట్ వరకు.. వాటి గురించి తెలుసుకుంటే ప్రవాసులకు ఎంతో మేలు!

ABN , First Publish Date - 2021-11-20T15:52:14+05:30 IST

విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) ఇప్పటివరకు చాలా రకాల వీసాలు, పలు పథకాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా వలసదారులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వడం, ఉపాధి కల్పించడం చేస్తోంది. తద్వారా లబ్ధి పొంది దేశ అభివృద్ధిని పెంపొందించుకోవాలనేది ఆ దేశ ప్రణాళిక. ఇక ప్రవాసులకు పని చేయడానికి ప్రపంచంలోని అత్యంత అనువైన దేశాల్లో యూఏఈ ఒకటి..

UAEలోని వివిధ వీసా పథకాలు.. 18 ఏళ్ల నుంచి మొదలుకుని రిటైర్మెంట్ వరకు.. వాటి గురించి తెలుసుకుంటే ప్రవాసులకు ఎంతో మేలు!

దుబాయ్: విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) ఇప్పటివరకు చాలా రకాల వీసాలు, పలు పథకాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా వలసదారులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వడం, ఉపాధి కల్పించడం చేస్తోంది. తద్వారా లబ్ధి పొంది దేశ అభివృద్ధిని పెంపొందించుకోవాలనేది ఆ దేశ ప్రణాళిక. ఇక ప్రవాసులకు పని చేయడానికి ప్రపంచంలోని అత్యంత అనువైన దేశాల్లో యూఏఈ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. భద్రతా పరంగాను ఆ దేశంలో వలసదారులకు ఎలాంటి ఢోకా ఉండదు. దీంతో చాలా మంది యూఏఈకి వలస వెళ్తుంటారు. అలా తమ దేశానికి వలస, ఉపాధి కోసం వచ్చే వివిధ రంగాలు, వృత్తుల వారికి యూఏఈ ఇప్పటికే పలు వీసా, రెసిడెన్సీ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు మనం వాటిపై ఓ లుక్కేద్దాం. 


పౌరసత్వం..

విదేశీయులకు యూఏఈ పౌరసత్వం కోసం తీసుకొచ్చిన పథకమే పౌరసత్వం. జనవరి 2021లో యూఏఈ ఈ పౌరసత్వ చట్టానికి సవరణలు. దీని ద్వారా నివాసితులు, వారి కుటుంబాలు యూఏఈ పాస్‌పోర్ట్‌కు అర్హత పొందేందుకు వీలు కల్పించింది. దీంతోపాటు వారి ప్రస్తుత జాతీయతను అలాగే ఉంచుతుంది. ప్రతి వర్గానికి నిర్ణీత ప్రమాణం ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ప్రయోజనం: యూఏఈ కమ్యూనిటీలో శాశ్వత భాగం లభిస్తోంది. ఇది అభివృద్ధి చెందుతూ కొత్త ప్రయోజనాలను అందిస్తుంది.

అర్హత: వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కళాకారులు, రచయితలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, వారి కుటుంబాలు.


పదవీ విరమణ వీసా(రిటైర్మెంట్ వీసా)..

సెప్టెంబరు 2018లో యూఏఈ 55 ఏళ్లు పైబడిన రిటైర్డ్ రెసిడెంట్‌ల కోసం ఐదేళ్ల కాలపరిమితితో ఈ రిటైర్మెంట్ వీసా స్కీమ్‌ను ఆమోదించింది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే పునరుద్ధరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇక నవంబర్ 2021లో పదవీ విరమణ తర్వాత దేశంలో ఉండాలనుకునే ప్రవాసులకు షరతులను సులభతరం చేయడానికి రిటైర్మెంట్ రెసిడెన్సీకి సవరణలు చేసింది.

ప్రయోజనం: సెల్ఫ్ స్పాన్సర్‌షిప్, యూఏఈలో కూడబెట్టిన ఆస్తులను నిలుపుకోవడం, దేశంలోని బలమైన జీవనశైలి, సౌకర్యాలకు ప్రాముఖ్యత.

అర్హత: ఆ దేశంలో సుమారు 1 మిలియన్ దిర్హమ్స్(సుమారు రూ.2కోట్లు) ఆస్తులు కలిగి ఉన్నవారు. 1 మిలియన్ దిర్హమ్స్‌కు తక్కువ కాకుండా బ్యాంక్ డిపాజిట్లు ఉన్న పదవీ విరమణ పొందిన ప్రవాసులు. సంవత్సరానికి రూ. 3.63కోట్లకు తక్కువ కాకుండా క్రియాశీల ఆదాయం ఉన్నవారు.


తాత్కాలిక వర్క్ పర్మిట్..

యూఏఈలోని ప్రధానమైన 50 ప్రాజెక్ట్‌లలో భాగంగా 2021 సెప్టెంబర్‌లో ఒక సంవత్సరం కాలపరిమితితో తాత్కాలిక వర్క్ పర్మిట్ ప్రకటించబడింది. టీనేజర్‌లు చదువుతున్నప్పుడు వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, పని చేయడానికి సిద్ధం కావడానికి, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని పొందేందుకు కుడా అనుమతిస్తుంది.

ప్రయోజనం: స్కూల్ గ్రాడ్యుయేషన్‌కు ముందే పని అనుభవాన్ని పొందవచ్చు. తద్వారా యూనివర్సిటీ రెజ్యూమ్‌లను మెరుగుపరచుకోవడంతో పాటు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను విస్తరించడానికి ఉపయోగపడుతుంది. 

అర్హత: 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారు.


ఫ్రీలాన్సర్ వీసా..

ఈ ఫెడరల్ వీసా పథకం యూఏఈ, విదేశాలలో ఉన్న స్వయం ఉపాధి కార్మికులు తమను తాము స్పాన్సర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

ప్రయోజనం: సెల్ఫ్ స్పాన్సర్‌షిప్‌తో పాటు దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా వివిధ ఉద్యోగాలల్లో చేరేందుకు వీలు కలుగుతుంది.

అర్హత: కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, డిజిటల్ కరెన్సీ వంటి ప్రత్యేక రంగాలలోని ఫ్రీలాన్సర్లు. 


బహుళ ప్రవేశ పర్యాటక వీసా(మల్టీ ఎంట్రీ టూరిజం వీసా)..

మార్చి 2021లో యూఏఈ ఈ మల్టీ ఎంట్రీ టూరిజం వీసా ప్రకటించింది. ఐదేళ్ల కాలపరిమితితో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది పర్యాటకులు 90 రోజుల పాటు దేశంలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. దీనిని మరో 90 రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది.

ప్రయోజనం: పునరావృత ప్రవేశం(రీపిటెడ్ ఎంట్రీ), బస పొడిగింపు(ఎక్స్‌టెండెడ్ స్టే), సెల్ఫ్ స్పాన్సర్‌షిప్.

అర్హత: అన్ని దేశాల నుండి వచ్చే పర్యాటకులు దీనికి అర్హులే.


రిమోట్ వర్క్ వీసా..

మార్చి 2021లో యూఏఈ ఈ ‘రిమోట్ వర్క్ వీసా’ పథకాన్ని ప్రకటించింది. విదేశాలలో ఉన్న కంపెనీల ఉద్యోగులు ఒక సంవత్సరం పాటు UAE నుండి రిమోట్‌గా నివసించడానికి మరియు పని చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. 

ప్రయోజనం: సెల్ఫ్ స్పాన్సర్‌షిప్, ఫ్లెక్సిబిలిటీ, యూఏఈలోని ఆకర్షణీయమైన వ్యాపార వాతావరణానికి యాక్సెస్, నెట్‌వర్కింగ్ అవకాశాలు.

అర్హత: స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, ఉపాధి రుజువు(ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయిమెంట్) ఉన్నవారు.


గోల్డెన్ వీసా..

వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది.

ప్రయోజనం: ఈ వీసా ద్వారా యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం ఉండదు. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.

అర్హత: 2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు.  


గ్రీన్ వీసా..

రాబోయే 50 సంవత్సరాలకు యూఏఈలోని భారీ ప్రాజెక్టుల కోసం మొదటి సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 2021లో గ్రీన్ వీసాను ప్రకటించింది. దీని ద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన వారికి సెల్ఫ్ రెసిడెన్సీని అందిస్తుంది.

ప్రయోజనం: సెల్ఫ్ స్పాన్సర్‌షిప్. తల్లిదండ్రులు, పిల్లలతో(25 ఏళ్లలోపు) సహా కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయగల సామర్థ్యంతో ఈ సెల్ఫ్ స్పాన్సర్‌షిప్ ఉంటుంది.

అర్హత: పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, వ్యాపార యజమానులు, అగ్రశ్రేణి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు.  




Updated Date - 2021-11-20T15:52:14+05:30 IST