రుగ్మతలకు చెక్‌ పెట్టే తేనీరు

ABN , First Publish Date - 2021-08-31T17:34:57+05:30 IST

కొన్ని స్వల్ప రుగ్మతలకు తేనీటితో చెక్‌ చెప్పవచ్చు. ఇందుకోసం ఆయా సమస్యలను తరమగలిగే ఔషధ గుణాలున్న పదార్థాలను టీకి జోడించాలి.

రుగ్మతలకు చెక్‌ పెట్టే తేనీరు

ఆంధ్రజ్యోతి (ఆగస్టు 30): కొన్ని స్వల్ప రుగ్మతలకు తేనీటితో చెక్‌ చెప్పవచ్చు. ఇందుకోసం ఆయా సమస్యలను తరమగలిగే ఔషధ గుణాలున్న పదార్థాలను టీకి జోడించాలి.


లెమన్‌ టీ: దగ్గు, జలుబు, కడుపు ఉబ్బరం, అజీర్తిలను పోగొట్టే లెమన్‌ టీ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి లెమన్‌ టీ తయారు చేసుకోవచ్చు.


జింజర్‌ టీ: ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌, జీర్ణ సమస్యలు, నెలసరి నొప్పులు, గొంతు నొప్పిలకు విరుగుడు జింజర్‌ టీ. ఈ టీ తయారీ కోసం అల్లం తరుగును నీళ్లలో వేసి, చిన్న మంట మీద మరిగించాలి. 


టర్మరిక్‌ టీ: వాపులు, నొప్పులను తగ్గించి శరీరాన్ని శుద్ధి చేసే గుణం పసుపుతో తయారుచేసిన టీకి ఉంది. గిన్నెలో నీళ్లు పోసి, బ్లాక్‌ టీ ఆకులను వేసి, చిటికెడు పసుపు కలిపి మరిగించి, టర్మరిక్‌ టీ తయారు చేసుకోవచ్చు.

Updated Date - 2021-08-31T17:34:57+05:30 IST