Jul 5 2021 @ 09:18AM

సూర్య, జీవీఎం కాంబినేషన్‌కి డిఫరెంట్‌ టైటిల్‌

హీరో సూర్య, స్టార్‌ దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్‌(జీవీఎం) కాంబినేషన్‌లో రానున్న ఆంథాలజీ వెబ్‌ సిరీస్‌ ఓ విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి పుష్కరకాలం క్రితం సినీ అభిమానులు అమితంగా మెచ్చిన, ఇష్టపడిన కాంబినేషన్లలో ఒకటి సూర్య, జీవీఎం కాంబో. వీరి కాంబినేషన్‌లో పలు హిట్‌ చిత్రాలు వచ్చాయి. కానీ, వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో ఈ కాంబో విడిపోయింది. ఈ నేపథ్యంలో 12 యేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక ఆంథాలజీ వెబ్‌ సిరీస్‌ రానుంది.  అదే దర్శక దిగ్గజం మణిరత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నవరస’. ఈ ఆంథాలజీ చిత్రం కోసం వీరిద్దరూ కలిశారు. మొత్తం 9 షార్ట్‌ స్టోరీస్‌ నిక్షిప్తమైవున్న ఈ చిత్రంలో వీరిద్దరికి సంబంధించిన షూటింగ్‌ పార్టును ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి ‘గిటార్‌ కంబిమేలే నిండ్రు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరో సూర్య గిటార్‌ సంగీత కళాకారుడుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను సూర్య పుట్టినరోజు కానుకగా రిలీజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ 'నవరస' విడుదలకానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

Otherwoodsమరిన్ని...