ఇరువర్గాలకు వేర్వేరు సమయాలు

ABN , First Publish Date - 2022-08-07T07:03:34+05:30 IST

ఇరువర్గాలకు వేర్వేరు సమయాలు

ఇరువర్గాలకు వేర్వేరు సమయాలు

విజయవాడలో మొహర్రం నిర్వహణపై హైకోర్టు ఆదేశం..శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని ఇరువర్గాలకు స్పష్టీకరణ

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడ పంజా సెంటర్‌లోని రన్‌ హుస్సేన్‌ పంజా ప్రాంగణంలో మొహర్రం పండుగ వేర్వేరు సమయాల్లో జరుపుకొనేందుకు షేక్‌ సులేమాన్‌, షేక్‌ జిలానీ సైదా వర్గాలకు అనుమతివ్వాలని విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌, పశ్చిమ డివిజన్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. జిలానీ సైదా వర్గాన్ని ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సులేమాన్‌ వర్గాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతిం చాని స్పష్టం చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగ జరుపుకోవాలని పిటి షనర్లను ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలు తప్ప నిసరిగా పాటించాలంది. ఒక వర్గంవారు పండుగ జరుపుకొనే సమయంలో మరో వర్గం ఆ ప్రాం తంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఎంత మందిని అను మతించాలో నిర్ణయించే బాధ్యతను అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషన్‌, మున్సిపల్‌ కమిషనర్‌లకు అప్ప గించింది. పంజా సెంటర్‌లో మొహర్రం జరుపు కొనేందుకు అనుమతించేలా విజయవాడ పశ్చిమ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌, మున్సిపల్‌ కమి షనర్‌లను ఆదేశించాలని కోరుతూ సులేమాన్‌ మరో ఇద్దరు, జిలానీ సైదా వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరి పిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హ రి ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు.


Updated Date - 2022-08-07T07:03:34+05:30 IST