మీరు కాక్‌టైల్- మాక్‌టైల్ అనే పేర్లను విన్నారా?.. వీటి మధ్య గల తేడా ఏమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-19T16:46:04+05:30 IST

పార్టీలకు వెళ్లేవారు లేదా రకరకాల డ్రింక్స్ తాగేవారు..

మీరు కాక్‌టైల్- మాక్‌టైల్ అనే పేర్లను విన్నారా?.. వీటి మధ్య గల తేడా ఏమిటో తెలుసా?

పార్టీలకు వెళ్లేవారు లేదా రకరకాల డ్రింక్స్ తాగేవారు కాక్‌టైల్- మాక్‌టైల్ లాంటి పదాలను చాలాసార్లు వినే ఉంటారు. నిజానికి కాక్‌టైల్- మాక్‌టైల్‌లలో వివిధ పానీయాల మిశ్రమం ఉంటుంది. అయితే ఈ రెండింటినీ తయారు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కాక్‌టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో.. వాటిలో ఏ పానీయాలు చేరుస్తారో తెలుసుకుందాం. కాక్‌టైల్ అనేది ఆల్కహాల్ కలిగిన పానీయాల సమూహం. ఉదాహరణకు ఆల్కహాల్, బీర్, టేకిలా మొదలైన వాటి కలయికతో చేసిన పానీయాలను కాక్‌టైల్ డ్రింక్స్ అని అంటారు. 


మద్యం, పండ్ల రసం లేదా సోడా మొదలైన వాటిని కలపడం ద్వారా పానీయం తయారు చేస్తే అది కాక్‌టైల్ విభాగంలో చేరుతుంది. కాక్‌టైల్ డ్రింక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు సంబంధించిన అనేక నియమాలను కలిగివుంటుంది. ఇలాంటి డ్రింగ్స్ విక్రయించాలంటే అనేక నిబంధనలు పాటించాల్సివుంటుంది. ఇంతేకాకుండా వీటిని తయారు చేసేందుకు ఒక ప్రత్యేక పద్దతి ఉంది. ఆల్కహాల్ పరిమాణం ఎంత ఉండాలి? దానిలో ఏ ఇతర పదార్థాలను కలపాలనేదానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇక మాక్‌టైల్ విషయానికొస్తే మాక్‌టైల్ అనేది.. కాక్‌టైల్‌కు పూర్తిగా భిన్నమైన పానీయం. ఆల్కహాల్ కలపని పానీయాన్ని తయారు చేసినప్పుడు అది మాక్‌టైల్ విభాగంలోకి వస్తుంది. మాక్‌టైల్ విభాగంలో అనేక రకాల పానీయాలు ఉంటాయి. అయితే అవన్నీ ఆల్కహాల్ కలపనివై ఉంటాయి. ఈ డ్రింక్స్ లో ఆల్కహాల్ లేకపోవడంతో వీటిని విక్రయించేందుకు నిబంధనలు అంతగా అడ్డంకి కాదు. వీటి తయారీకి అనుసరించాల్సిన ప్రత్యేక నియమం ఏమీ ఉండదు.

Updated Date - 2022-01-19T16:46:04+05:30 IST