బరువు తగ్గడం కోసం చేసే ప్రయత్నాల్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

ABN , First Publish Date - 2022-04-21T17:13:38+05:30 IST

బరువు తగ్గడం కోసం తెలిసిన డైట్లన్నీ అనుసరిస్తాం. అయినా బరువు తగ్గడం లేదంటే మనం చేసే ప్రయత్నాల్లో పొరపాట్లు దొర్లుతున్నాయని అర్థం చేసుకోవాలి. వాటిని కనిపెట్టి సరిదిద్దుకోవాలి.

బరువు తగ్గడం కోసం చేసే ప్రయత్నాల్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

ఆంధ్రజ్యోతి(21-04-2022)

బరువు తగ్గడం కోసం తెలిసిన డైట్లన్నీ అనుసరిస్తాం. అయినా బరువు తగ్గడం లేదంటే మనం చేసే ప్రయత్నాల్లో పొరపాట్లు దొర్లుతున్నాయని అర్థం చేసుకోవాలి. వాటిని కనిపెట్టి సరిదిద్దుకోవాలి.


ప్లానింగ్‌ లేకపోవటం

సరైన ప్లానింగ్‌ లేకపోతే అందుబాటులో ఉన్నవాటితో ఆకలి తీర్చుకుంటాం. కాబట్టి ఎటువంటి ఫ్యాటీ ఫుడ్‌ మీ మెనులో చేరకుండా ఉండాలంటే వారం మొత్తంలో మీరు తినబోయే కూరగాయలు, పళ్లు, స్నాక్స్‌తో సహా ముందుగానే ప్లాన్‌ చేసుకుని ఇంట్లో ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆకలేసినప్పుడు తినటానికి ఆరోగ్యకరమైన నాన్‌ ఫ్యాటీ ఫుడ్‌ సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్‌ తినటం వల్ల లావవుతామనే భయం ఉండదు.


అందరికీ చెప్పటం అవసరం

డైట్‌ చేస్తున్న విషయం కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌, బంధువులు...ఇలా అందరికీ చెప్పేయాలి. ఇలా చెప్పటం వల్ల ఐస్‌క్రీమ్‌కు బదులుగా హెల్దీ సలాడ్స్‌ తినటానికి ఆహ్వానిస్తారు. మొహమాటాలకు కూడా తావుండదు. బరువు తగ్గాలనే మీ లక్ష్యానికి కట్టుబడి ఉంటారు.


ప్రొటీన్లు సమంగా!

బరువు తగ్గాలంటే పిండిపదార్థాలు లేని హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకోవాలనే విషయం నిజమే! అయితే ఈ రకం డైట్‌ మీద ఎక్కువకాలం ఆధారపడితే పళ్లు, కూరగాయలు, బీన్స్‌, నట్స్‌, సీడ్స్‌, గ్రెయిన్స్‌లో ఉండే అత్యవసరమైన పోషకాలను కోల్పోతాం. ఈ పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. కాబట్టి వీటి ద్వారా శరీరానికి తగినంత ప్రొటీన్‌ అందేలా ప్లాన్‌ చేసుకోవాలి. సమతులమైన ప్రొటీన్లు బరువును అదుపులో ఉంచుతాయి. కాబట్టి తినే ప్రతి ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.

Updated Date - 2022-04-21T17:13:38+05:30 IST