Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాల క్రీడాకారుల డైట్‌ ప్లాన్‌?

ఆంధ్రజ్యోతి(19-03-2021)

ప్రశ్న: క్రీడాకారులవడానికి సాధన చేస్తున్న పది సంవత్సరాలలోపు పిల్లలకు డైట్‌ ప్లాన్‌ చెబుతారా?


- ఎస్‌.ఎం.ఆర్‌. క్రికెట్‌ అకాడమీ


డాక్టర్ సమాధానం: క్రీడల్లో సాధన చేసే పిల్లలకు శారీరక శ్రమ ఎక్కువ. సరైన ఆహార నియమాలు పాటించకపోతే వారి ఎదుగుదల, ఆరోగ్యం సక్రమంగా ఉండవు. ఈ పిల్లలకు సమయానికి ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయాన్నే ఆటల సాధనకు వెళ్లే ముందు అరటిపండు, ఆపిల్‌ పండు, ఎండుద్రాక్ష, అంజీర, ఖర్జూర లాంటివి తీసుకుంటే తగిన శక్తి సమకూరుతుంది. సాధన ముగిసిన వెంటనే మంచి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన పాలు, గుడు,్ల ఓట్స్‌, పీనట్‌ బటర్‌ ఇవ్వాలి. ఇడ్లీ, దోసె లాంటి అల్పాహారంతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు కొంత మంచిదే. ఆకుకూరలు, కూరగాయలు వేసి చేసిన ఫ్లేవర్డ్‌ రైస్‌ లేదా పప్పుతో చేసిన కిచిడి లేదా కూరతో పాటు చపాతీలు మధ్యాహ్నం ఇవ్వాలి. సాయంత్రం ఆటల సాధనకు ముందుగా కూడా ఓ కప్పుపాలు, స్నాక్స్‌గా పళ్ళు, బఠాణీలు, సెనగలు, వేరుశెనగపప్పు, మరమరాలు, అటుకులు మంచివి. నూనెతో చేసిన చిరుతిళ్ళు, బిస్కెట్లు, చాక్‌లెట్లు, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌ లాంటి జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉంచాలి. రాత్రి భోజనంలో కూడా తేలికగా ఉండే అన్నం లేదా చపాతీతో కొంత కూర, పెరుగు లేదా మజ్జిగిస్తే మంచిది. కావాలంటే ఈ సమయంలో మరొక పండు కూడా తీసుకోవచ్చు. వారానికి ఒకటి రెండు సార్లు మాంసాహారం తినేలా చూడండి. నిద్రపోవడానికి కనీసం గంటన్నర ముందుగా రాత్రి భోజనాన్ని ముగించేలా చూడాలి. ఆటల వల్ల అలిసిన శరీరం కోలుకొని పునరుత్తేజితం కావడానికి కనీసం ఎనిమిది నుండి పది గంటల నిద్ర అవసరం.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement