Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరువు తగ్గేందుకు సరైన డైట్స్ ఏంటి?

ఆంధ్రజ్యోతి(30-04-2021)

ప్రశ్న: నాకు ఇరవై నాలుగేళ్లు. బరువు తగ్గేందుకు సరైన డైట్స్‌ సూచించండి.


- శ్యామ్‌, విజయవాడ


డాక్టర్ సమాధానం: డైట్‌ పేరుతో కొన్ని రకాల ఆహారపదార్థాలు మానెయ్యడం లేదా పూర్తిగా కడుపు మాడ్చుకోవడం; డిటాక్స్‌ పేరుతో రకరకాల పానీయాలు సేవించి పోషకాహారం మానెయ్యడం తదితర ప్రయత్నాల కంటే సరైన పాళ్ళలో పోషకాహారాన్ని తీసుకుంటే నెమ్మదిగానైనా మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. మీ వయసు, ఎత్తును బట్టి ముందుగా ఎంత బరువు ఉండాలో చూసుకోండి. ఆహారనియమాలు, శారీరక వ్యాయామం  ద్వారా నెలకు రెండు నుంచి మూడు కేజీల బరువు ఆరోగ్యకరంగా తగ్గవచ్చు. రోజూ సరైన సమయానికి ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకోండి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పప్పు లేదా గుడ్లు తప్పనిసరి. వెన్న తీసిన పాలు, పెరుగు కూడా బరువు నియంత్రణకు చాలా ఉపయోగపడతాయి. ఆకలైనప్పుడు మాత్రమే తినడం, కడుపు నిండా కాకుండా తగిన మోతాదులోనే ఆహారం తీసుకోవడం మంచిది. స్నాక్స్‌ కూడా ఆరోగ్యకరమైనవై ఉండాలి. పండ్లు, వేయించిన బఠాణీలు, సెనగలు, మొలకెత్తిన గింజలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటే తక్కువ కెలోరీల్లోనే ఎక్కువ పోషక పదార్థాలు లభిస్తాయి. నిద్ర పోయేందుకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందుగా రాత్రి భోజనాన్ని ముగించాలి. వీటితో పాటు శారీరక వ్యాయామాన్ని చెయ్యాలి. వీటన్నిటి వల్లా శక్తి మెరుగు పడుతుంది. ఉత్సాహంగా ఉంటారు. చర్మం మంచి మెరుపును సంతరించు కుంటుంది.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...