‘డీజిల్‌ ధరలను నియంత్రించాలి’

ABN , First Publish Date - 2021-02-25T05:39:53+05:30 IST

పెరుగుతున్న డీజి ల్‌ ధరను నియంత్రించాలని ఆదిలాబాద్‌ లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అసోసియేషన్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు.

‘డీజిల్‌ ధరలను నియంత్రించాలి’
ఆందోళన చేస్తున్న లారీ అసోసియేషన్‌ సభ్యులు

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 24: పెరుగుతున్న డీజి ల్‌ ధరను నియంత్రించాలని ఆదిలాబాద్‌ లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అసోసియేషన్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు కిషోర్‌ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలతో అదనపు భారం పడి లారీ ఓనర్స్‌ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం 15ఏళ్లు దాటిన వాహనాలను స్ర్కాప్‌ పాలసీని ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందులో జిల్లా లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేష న్‌ అధ్యక్షుడు అక్బర్‌ఆలీ, అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:39:53+05:30 IST