Abn logo
Jul 12 2020 @ 16:09PM

మళ్లీ పెరిగిన డీజిల్ ధర.. ఈసారి ఎంతంటే?

న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర మళ్లీ పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ. 81కి చేరువైంది. డీజిల్ ధర నేడు లీటరుకు 16 పైసలు పెరిగింది. ఫలితంగా లీటరు డీజిల్ ధర రూ. 80.94కు చేరుకుంది. డీజిల్ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అయితే, దాదాపు రెండు వారాలుగా పెట్రోలు ధరలో మాత్రం మార్పు లేదు. ప్రస్తుతం పెట్రోలు ధర లీటరుకు రూ. 80.43 వద్ద కొనసాగుతోంది. స్థానిక పన్నులు, వ్యాట్ కారణంగా ఈ ధరలు వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రకంగా ఉండే అవకాశం ఉంది. డీజిల్ ధరను చివరిసారి జులై 7న సవరించగా, పెట్రోలు ధరను చివరి సారి జూన్ 29న సవరించారు. గత ఐదు వారాల్లో డీజిల్ ధర 24 సార్లు పెరగ్గా, పెట్రోలు ధర 21సార్లు పెరిగింది. 

Advertisement
Advertisement
Advertisement