Viral Video: ఆ ఊరి ప్రజలను వరించిన అదృష్టం.. గ్రామ పరిసరాల్లో Diesel pond.. లీటర్ల కొద్దీ డీజిల్‌ను ఫ్రీగా తోడుకున్న జనం!

ABN , First Publish Date - 2022-07-10T19:00:37+05:30 IST

పెరిగిన ఇంధన ధరలతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఓ గ్రామానికి చెందిన ప్రజలను అదృష్టం వరించింది. గ్రామ పరిసరాల్లో డీజిల్‌తో కూడిన గుంత ఏర్పడింది. దీంతో ఆ గుంత దగ్గరకు జనం తండోప

Viral Video: ఆ ఊరి ప్రజలను వరించిన అదృష్టం.. గ్రామ పరిసరాల్లో Diesel pond.. లీటర్ల కొద్దీ డీజిల్‌ను ఫ్రీగా తోడుకున్న జనం!

ఇంటర్నెట్ డెస్క్: పెరిగిన ఇంధన ధరలతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఓ గ్రామానికి చెందిన ప్రజలను అదృష్టం వరించింది. గ్రామ పరిసరాల్లో డీజిల్‌తో కూడిన గుంత ఏర్పడింది. దీంతో ఆ గుంత దగ్గరకు జనం తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. ఫ్రీగా లీటర్ల కొద్దీ డీజిల్‌ను తోడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు.. ఆ  గ్రామ ప్రజలపై అసూయ పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..





ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో ఉన్న గీడం పోలీస్ స్టేషన్ పరిధి గ్రామ ప్రజలు.. గుంతలోంచి లీటర్ల కొద్దీ డీజిల్‌ను ఫ్రీగా తోడేసుకుంటున్నారు. అయితే ఈ Diesel pond వెనకాల ఓ పెద్ద కథే ఉంది. అదేంటంటే.. రాయ్‌పూర్ నుంచి బచేలీ వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్.. అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న బైకర్‌ను  ట్రక్కు డ్రైవర్ తప్పించేందుకు ప్రయత్నంలో ఇది చోటు చేసుకుంది. దీంతో భారీ మొత్తంలో డీజిల్.. నేలపాలైంది. అదికాస్తా దగ్గర్లోని నీటి గుంతలోకి చేరడంతో.. అక్కడ డీజిల్‌తో కూడిన గుంత తయారైంది. ఆ గుంత కాస్తా.. గ్రామస్థుల కంట పడటంతో.. పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్నారు. ఫ్రీగా లీటర్ల కొద్దీ డీజిల్‌ను తోడేసుకున్నారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే..  డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పిన ఘటనలో ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌తో బైకర్ కూడా స్పల్పంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా క్రేన్ సహాయంతో దాదాపు 3 గంటలు కష్టపడి డీజిల్ ట్యాంకర్‌ను పైకి లేపారు. 


Updated Date - 2022-07-10T19:00:37+05:30 IST