రెండో రోజూ పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు

ABN , First Publish Date - 2021-02-25T14:08:53+05:30 IST

రెండో రోజూ పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు

రెండో రోజూ పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు సంస్థలు వరుసగా రెండవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఫలితంగా సామాన్యులకు కాస్తంత ఊరట లభించినట్లయ్యింది. ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత మంగళవారం డీజిల్ ధర 35 నుంచి 38 పైసలు వరకూ పెరిగింది. ఈ రోజు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చన్నైలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.


పట్టణండీజిల్ (లీటరు) పెట్రోల్ (లీటరు) 
ఢిల్లీ81.32        
90.93
కోల్‌కతా          
84.20        
91.12
ముంబై          
88.44        
97.34
చెన్నై                  
86.31        
92.90



ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్, ఇతర పన్నులు కలుపుకొని వాటి ధర రెండింతలు అవుతోంది. 

Updated Date - 2021-02-25T14:08:53+05:30 IST